దేవరకద్ర: జాతీయ రహదారిపై రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు

మంగళవారం, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 15జీ 0251) మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జాతీయ రహదారి 44పై అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్