మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ కుమార్తె వేదాన్షీ (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.