దేవరకద్ర: 'గుర్తుంచుకో రామక్క' పాటతో కాంగ్రెస్ జోరు

మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 10 వార్డుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు 'గుర్తుంచుకో రామక్క. చేతిని గుర్తుంచుకో రామక్క' అంటూ పాటలకు నృత్యాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో పట్టణమంతా కాంగ్రెస్ శ్రేణుల సందడితో కోలాహలంగా మారింది.

సంబంధిత పోస్ట్