మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఉరుములు, మెరుపుల ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం కారణంగా కౌకుంట్ల సబ్స్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.