మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపూర్ లో రూ. 32.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి శనివారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. పథకం శంకుస్థాపన కు విచ్చేసిన మంత్రులకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.