మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఆదివారం ధ్వజ స్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని దర్శించుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. స్వామివారి కృపతో రైతులు, గ్రామస్తులు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.