దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, స్వయంగా ఎడ్ల బండి ఎక్కి ఉత్సవాలను ప్రారంభించారు. ఏరుక తాడు, రివర్స్ ట్రాక్టర్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల పొలాలు సస్యశ్యామలం కావాలని ఆయన ఆకాంక్షించారు.