దేవరకద్ర: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట సమీపంలోని మల్లం బావి వద్ద కర్నూలు రోడ్డులో శనివారం ఓ కారు లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్