మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దేవరకద్ర మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను మహబూబ్ నగర్ ఎస్పీ డి. జానకి గురువారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.