దేవరకద్ర: వైభవంగా ఏరువాక ఉత్సవాలు

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం రాజోలి గ్రామంలో శనివారం సాయంత్రం ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమికి ముందు వచ్చే శనివారం ఈ ఉత్సవాలు జరపడం గ్రామ ఆనవాయితీ. రైతులు తమ ఎడ్లను శుభ్రం చేసి, రంగులు, మువ్వలతో అలంకరించి, ఎడ్లబండ్లతో ఆలయానికి ప్రదర్శనగా వచ్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండాలని రైతులు స్వామివారిని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్