పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడి దుండగులు అందిన కాడికి దోచుకెళ్లిన ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో గురువారం వెలుగు చూసింది. ఎస్ఐ రామ్ లాల్ వివరాల ప్రకారం.. చిన్న చింతకుంట మండల పరిధిలో ఉన్న ఉంద్యాలకి చెందిన మహమ్మద్ అక్రమ్, ఆయన తల్లి వహీదా బేగం బుధవారం సాయంత్రం ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు బీరువా పగలగొట్టి 3 తులాల బంగారు గొలుసు, 19 తులాల కాళ్ల గొలుసులు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్ఐ విచారణ చేపట్టారు.