మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం దివ్యాంగులకు స్కూటీలు, ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం దేవరకద్ర, సీసీ. కుంట, కౌకుంట్ల మండలాల అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేసి పౌష్టికాహార పర్యవేక్షణను మెరుగుపరచాలని ఆయన సూచించారు.