దేవరకద్ర: పాఠశాల విద్యార్థులకు సైకిల్ అందిస్తా: ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలంలోని కొన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకుని, చిన్నారులను అభినందించారు. విద్యార్థుల కోరిక మేరకు పరిసర గ్రామాల నుండి పాఠశాలకు కాలినడకన వచ్చే వారికి సైకిల్స్ త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్