దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల పరిధిలోని కనిమెట్టలో అదనపు కట్నం వేధింపులు తాళలేక ఉషారాణి (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. రూ. 20 లక్షల అదనపు కట్నం తేవాలని భర్త మల్లేష్, అత్త అంజలమ్మ, మామ హనుమంతులు వేధించడమే దీనికి కారణమని మృతురాలి తల్లి పద్మమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. విక్రమ్ బుధవారం తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.