వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండలం రాయినిపేటలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల తరగతి అదనపు గదులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యే ఏకైక మార్గమని తెలిపారు.