పాలమూరులో హైటెక్ వ్యభిచార సూత్రధారులు అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్ లో జరుగుతున్న హైటెక్ వ్యభిచార వ్యాపారం కేసులో ప్రధాన నిందితులు సంతోష్ రెడ్డి, ఆంజనేయులు అలియాస్ అంజిలను టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వీరిని సాంకేతిక ఆధారాలతో పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అపార్ట్మెంట్లలో అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని టూ టౌన్ ఎస్ఐ ఇజాజుద్దీన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్