మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలంలో తుమ్మల చెరువు కట్టపై బుధవారం రాత్రి కొండచిలువ కలకలం సృష్టించింది. పొలం నుండి ఇంటికి వస్తున్న రైతు పామును చూసి భయాందోళనకు గురయ్యాడు. రాత్రిపూట ఆ దారిలో వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు కొండచిలువను పట్టుకుని తరలించాలని రైతులు కోరుతున్నారు.