మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట, సున్నంబట్టి ప్రాంతాలలో రెండు చిరుతలు ఆదివారం సంచరించాయి. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుట్టకు దగ్గర చాలా నివాసగృహాలు ఉండడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులను స్పందించి వెంటనే చిరుతలను బంధించాలని కోరుతున్నారు.