మీ పాలనలో పెట్టిన కేసుల లెక్క తీద్దాం: దేవరకద్ర ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 నుండి 2024 వరకు నమోదైన అక్రమ కేసుల చిట్టా విప్పుదామని సవాల్ విసిరారు. గత పదేళ్లలో జూనియర్ కాలేజీ కోసం పోరాడిన వారిపై, పేరూరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న సామాన్యులపై, కొత్తకోట మండలం మిరాస్ పల్లిలో పింఛన్ల పంపిణీపై శాంతియుతంగా కోరిన కార్యకర్తలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి 13 రోజులు జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్