మహబూబ్నగర్: మైనార్టీ సంక్షేమానికి మరో అడుగు: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మైనార్టీ సంక్షేమ నిధులతో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన అహెలే హదీస్ ప్రహరీని మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం కృషి చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్