మహబూబ్ నగర్: కారు-బొలెరో ఢీ.. ఒకరి మృతి

మంగళవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వీరన్నపేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బొలేరోను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మహబూబ్ నగర్ కు చెందిన తహేర్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. రేహాన్, ఇమ్రాన్, నిరంజన్, వేణుగోపాల్ లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్