మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ చెరువులో క్యాట్ఫిష్ చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కారణం తెలియకుండా చేపలు చనిపోతుండగా, ఆదివారం చేపల వలకు పెద్ద ఎత్తున క్యాట్ఫిష్ చిక్కడంతో భయాందోళనలు పెరిగాయి. వెంటనే వీటిని తొలగించాలని మత్స్యకారులు కోరుతున్నారు.