మహబూబ్ నగర్: డీసీఎం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం అప్పన్నపల్లి డెంటల్ కాలేజీ సమీపంలో మంగళవారం సాయంత్రం అధిక లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై వెళ్తున్న బైకు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ హాస్పిటల్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్