మహబూబ్ నగర్: అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: ఎమ్మెల్యే

గురువారం రాత్రి హన్వాడ పెద్దదర్పల్లిలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అనంతమ్మ ఇ. సుధాకర్ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్