మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీలు, సభలు నిర్వహించుకోవాలని సూచించారు.