మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ జాతీయ రహదారి-44 ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును వెనక నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తిరుపతికి చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.