మహబూబ్ నగర్ పురపాలక న్యూ ప్రేమ్ నగర్ వార్డు మాజీ కౌన్సిలర్ కిషోర్ కుమార్, రెండు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన తర్వాత, గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. కిషోర్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు.