మహబూబ్ నగర్: చిరుత సంచారం చూసిన మాజీ మంత్రి

మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని టీడీ గుట్ట ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న చిరుత పులిని గురువారం మరోసారి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్వయంగా చూశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హన్వాడ వెళ్తున్న ఆయన మార్గమధ్యలో ప్రజలు గుమిగూడి ఉండటాన్ని గమనించి కిందకు దిగారు. చిరుత టీడీ గుట్టలపై తిరుగుతూ ఉండటాన్ని స్థానికులు మాజీ మంత్రికి దగ్గర ఉండి చూపించారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

సంబంధిత పోస్ట్