ఓ అమ్మాయి నగ్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో ఆ వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ వివరాల ప్రకారం హన్వాడకు చెందిన ఏజాస్ ఫిజా ఫొటో స్టూడియోను నడుపుతూ ఫొటోలు దిగటానికి వచ్చిన అమ్మాయిని ట్రాప్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు వీడియో తీశాడన్నారు. వీటిని చూపించి బ్లాక్ మేయిల్ చేయటంతో అతడిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 20 మందిని ఇలా ట్రాప్ చేసినట్లు సమాచారం