మహబూబ్ నగర్: శుభవార్త... కొత్త వీక్లీ ఎక్స్ ప్రేస్

తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సరికొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. అకోలా-తిరుపతి (17430) రైలు మే 3న, తిరుపతి- అకోలా (17429) రైలు మే 8న పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులో ఏసీ, స్లీపర్ సదుపాయాలు కల్పించారు. ఈ రైలు కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తిరోడ్డు, గద్వాల మీదుగా ప్రయాణిస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి దర్శనం మరింత సులభతరం కానుంది.

సంబంధిత పోస్ట్