మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు, బుధవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు యజమానులకు సీఐ అప్పయ్య పలు సూచనలు ఇచ్చారు. షాపుల్లో మత్తు పదార్థాలు, గుట్కా, గంజాయి వంటి నిషేధిత వస్తువులు అమ్మరాదని, పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.