పాలమూరు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు గంటల్లో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ వర్షం తీవ్రత పెరగనుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ కుండపోత వర్షాలు ఉదయం కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.