మహబూబ్ నగర్: భగీరథ కాలనీలో వ్యక్తి అనుమానాస్పద మృతి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల భగీరథ కాలనీ సమీపంలో శ్రీనివాస్ చారి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని షాసాబ్ గుట్టకు చెందిన శ్రీనివాస్ చారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు రూరల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్