మహబూబ్ నగర్: కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని వేపూరు, దాచకపల్లి, యారోనిపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్