మహబూబ్ నగర్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపదని, అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్