మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, తన కుమార్తె డీకే స్నిగ్ధారెడ్డితో కలిసి శనివారం కర్ణాటకలోని బగల్ కోట జిల్లా హునుగుంద మండలం సిద్ధాంకోళ్ల గ్రామంలోని శ్రీ పరమ పూజ్య మహాతపస్వి శ్రీ సిద్దప్ప అజ్జనవారి మఠాన్ని సందర్శించారు. అనంతరం, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా, సిద్ధాంకోళ్ల మఠంలోని పురాతన శైవక్షేత్రంలో స్వయంభూ శివలింగానికి దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.