మహబూబ్ నగర్: మున్సిపల్ ఎన్నికలు.. ఎంపీ డీకే అరుణ కీలక సమావేశం

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కమిటీ నియమించిన ఇంచార్జులతో ఎంపీ డీకే అరుణ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీల వారీగా బలాబలాలు, గెలుపు వ్యూహాలు, ప్రచార శైలి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ హాజరుకానున్న కార్యకర్తల సమావేశం ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్