మహబూబ్ నగర్: నడిరోడ్డుపై ఆగిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికుల పాట్లు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి శనివారం తాండూరు బయలుదేరిన ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్దకు రాగానే ఒకసారిగా ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదేమి లేక ప్రయాణికులు మళ్లీ ఆర్టీసీ బస్టాండ్ కు నడక ద్వారా వెళ్లి వేరే బస్సును ఎక్కే ప్రయత్నం చేశారు. బస్సు ఫిట్నెస్ ముందే చూసుకోకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండవని ప్రయాణికులు వాపోయారు.

సంబంధిత పోస్ట్