మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం, 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ మైనారిటీ గురుకుల విద్యార్థులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సత్కరించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.