మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారు పదేళ్లు పాలించి నిధులను ఖాళీ చేసి అధికారం కోల్పోయి ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చారని ఆరోపించారు. పదేళ్ల పాటు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం పర్యటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.