మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వే ట్రాక్ వద్ద వంతెన నిర్మాణానికి ఏప్రిల్ లో టెండర్లు పిలిచే అవకాశం ఉందని ఎంపీ డీకే అరుణ శుక్రవారం తెలిపారు. దేవరకద్ర వంతెనకు ఫిబ్రవరిలో టెండర్లు వేస్తామన్నారు. వీరన్నపేట, మోతీ నగర్, తిమ్మసానిపల్లి, బోయపల్లి వద్ద కూడా వంతెనల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె పేర్కొన్నారు. శ్రీరామ్ నగర్, కౌకుంట్ల, జడ్చర్ల లకు సంబంధించిన ROB, RUB ల గురించి గతంలో రైల్వే శాఖ మంత్రికి, రైల్వే జీఎం లకు వినతిపత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు.