మహబూబ్ నగర్: విషాదం.. నీటి సంపులో బాలుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడవి వెంకటాపూరంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విస్లావత్ పాండు, కవిత దంపతుల రెండేళ్ల కుమారుడు విస్లావత్ ధనుష్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబీకులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్