మహబూబ్ నగర్: కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. డీకే అరుణకు ఛాన్స్!

కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ 28 లేదా 29 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ప్రచారం ఊపందుకుంది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆమె నియోజకవర్గంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో డీకే అరుణకున్న అనుభవం, మహిళా కోటా వంటి అంశాలు ఆమెకు అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్