మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ జానకిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని ఆమె అన్నారు.