మహబూబ్ నగర్: మహిళలు, యువత స్వావలంబన సాధించాలి: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మహిళలు చదువుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో ప్రారంభించిన ఉచిత ఎం.ఎస్. కంప్యూటర్ కోర్సుకు ఆయన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల విద్యకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ, సెట్విన్, ఐటిఐల ద్వారా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధి తో మహిళలు, యువత ముందుకు రావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్