మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఐదుగురు పట్టుబడ్డారు. వీరిలో మద్యం మత్తులో డీసీఎం నడిపిన డ్రైవర్‌కు గురువారం కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించింది. మిగిలిన నలుగురు బైకర్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.