జులై 5న వెన్నాచేడ్కు ఎమ్మెల్యే రాజాసింగ్

గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో జులై 5వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అంబా త్రయ క్షేత్ర స్థాపకులు ఆదిత్య పరాశ్రీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు శివాజీ మహారాజ్ యువజన సంఘం సభ్యులు తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్