తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టీఆర్పీ అండగా ఉంటుందని మల్లన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.