మహబూబ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. జానకి బుధవారం పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, న్యాయసమ్మతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లరాదని, ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.