మహబూబ్ నగర్ జిల్లా మణికొండకు చెందిన జ్యోతి, జిల్లా కోర్టు నుంచి ఆటోలో ప్రయాణించి, తన బ్యాగులో ఉన్న 5 గ్రాముల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు మర్చిపోయినట్లు గుర్తించి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంతు రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి, AP 22 TA 7262 ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ హరిచందన్ ను పిలిపించి, బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని, ఆభరణాలను జ్యోతికి సురక్షితంగా అందజేశారు.